గత కొంతకాలంగా  తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇలా మధ్య విభేదాలు నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా క్రమశిక్షణ కమిటీ ముందు వీరిద్దరూ  హాజరయ్యారు. ఉదయం కోలికపూడి శ్రీనివాసరావు సాయంత్రం చిన్నిలను క్రమశిక్షణ కమిటీ విచారణ చేశారు. ఇద్దరి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి కమశిక్షణ కమిటీ ఒక నివేదిక తయారు చేసి పెట్టింది. దాన్ని సీఎం చంద్రబాబుకు అందించబోతున్నారు. ఇందులో ఎవరికి అనుకూలం ఉంది ఎవరికి వ్యతిరేకంగా ఉంది అనేది చూద్దాం.. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తీవ్రమైన వివాదం జరుగుతోంది. వీరికి సంబంధించిన విషయాలను ఒకరికొకరు బయట పెడుతూ మీడియా ముందు కూర్చుంటున్నారు. దీంతో పార్టీ పరువు దారుణంగా దెబ్బతింది. దీనిపై స్పందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసి వారి మధ్య ఉన్న విభేదాలను తేల్చాలని అసలు ఇందులో తప్పు ఎవరిదో నాకు నివేదిక సమర్పించాలని కోరారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని పిలిచి పలు ప్రశ్నలను అడిగింది. దానికి సంబంధించిన రికార్డు తయారు చేసి నివేదిక సీఎం చంద్రబాబుకు అందించబోతోంది. 

ఇదే తరుణంలో  కొలికపూడి శ్రీనివాసరావుకు అన్యాయం జరగబోతుందని  ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ఆయన తప్పులేకున్న ఆయనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివాదంలో తెలుగుదేశ అనుకూల మీడియా మొత్తం కేశినేని చిన్నికి అనుకూలంగా కొలికపూడికి వ్యతిరేకంగా రాసుకుంటూ వస్తోంది. తాజాగా ప్రధాన పత్రిక రాసుకు వచ్చిన అంశం బట్టి చూస్తే.. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి ఒక మాటకు మరో మాటకు పొంతన లేకుండా చెప్పినట్టు  ఆ పత్రికలో రాసుకొచ్చారు. అయితే క్రమశిక్షణ కమిటీ చాలా సీక్రెట్ గా నివేదిక తీసుకున్నారు. అది కేవలం లోకేష్ కు తప్ప మరొకరికి తెలియదు. ఇది చంద్రబాబు దగ్గరికి చేరిన తర్వాత ఆయన అందరి ముందు బయట పెడితే తప్పా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది బయటకు రాదు. అది  బయటికి రాకముందే ఆ ప్రధాన పత్రిక మీడియా సంస్థ కొలికపూడి తప్పు  అన్నట్టు చూపిస్తోంది.

 అంతేకాదు  కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని ఇందులో రాసుకోవచ్చారు.. నిజానికి కొలికపూడి బెల్ట్ షాపులు, ఇసుక సంబంధించి వ్యవహారంపై ఆయన  ఆధారాలు చూపెట్టారు. టికెట్ ఇచ్చే సమయంలో ఐదు కోట్లు తీసుకున్నారని కూడా అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కొలికపుడి చూపించినా, కానీ ఆ మీడియాలో ఆయన ఏమి చూపించలేదు. నిరాధారమైన ఆరోపణలు చేసినట్టే రాసుకోచ్చారు. అలాగే పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా కొలికపూడి పని చేస్తున్నారని రాసుకొచ్చారు. ఒకవేళ కొలికపూడి అలా చేసి ఉంటే మాత్రం, చిన్నికి అంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఈ విధంగా కొలికపూడికి కేశినేని చిన్ని ఏదో బిచ్చమేసి పదవి ఇప్పిచ్చినట్టు ముందుగానే వార్తలు రాసుకొచ్చారు. ఆయన తప్పు చేసినటువంటి ఫీలింగ్ వచ్చే విధంగా చేస్తున్నారు. నిజానికి ఈ నివేదిక ఎలా ఉంది ఎవరి తప్పు అనేది చంద్రబాబు బయట పెట్టే వరకు బయటకు రాదు కానీ వీళ్ళు మాత్రం ఇలా కొలికపూడి తప్పు అన్నట్టు రాసుకు రావడం చూస్తే మాత్రం అబద్ధపు జర్నలిజానికి పరాకాష్ట అంటూ  కోలికపూడి అభిమానులు మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: