జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం అనేది చాలా హోరాహోరీగా సాగుతోంది.. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు బీజేపీ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి.. గెలుపు పై వారి వారి అభిప్రాయాలని  బయటపెడుతున్నాయి.. ఇదే సమయంలో అన్ని పార్టీల కీలక నేతలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో తిష్ట వేశారు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. కేటీఆర్ మంచి వ్యక్తి కాదని ఆయన మాగంటి గోపీనాథ్ తల్లిని కూడా తన దగ్గరికి రాకుండా చేశారని, ఇండస్ట్రీ వారిని ఇబ్బందులకు గురి చేశారంటూ మాట్లాడారు.

అంతే కాదు కేసీఆర్ చేసిన పనుల గురించి కూడా మాట్లాడారు. అయితే ఇదే తరుణంలో  కేటీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇద్దామని అనుకున్నారట. కానీ ఇంతలోనే కేసీఆర్ కేటీఆర్ కు ఫోన్ చేసి నాలుగు మొట్టికాయలు వేసి రేవంత్ రెడ్డి ప్రస్టేషన్ అవుతున్నారు.ఆయన ఓడిపోతున్నారని అర్థమైంది. సైలెంట్ గా ఉండు ఏదైనా సంయమనం పాటించు. ఎదుగుతున్న లీడర్ కి తప్పనిసరిగా ఓపిక అవసరం..అన్ని పార్టీల నాయకులు ఈ సంయమనం పాటిస్తేనే రాజకీయాలకు హుందాతనం అనేది పెరుగుతుంది.ఇలా చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయితే ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి సంస్కృతికి మనమే ముందు పునాది వేయాలి. ఏమన్నా కూడా టెంప్ట్ అవ్వకు సైలెంట్ గా ఉండు.

.మనం ఎంత ఓపికగా ఉంటే అంత మంచిదంటూ కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు ఫోన్ ద్వారా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ డైరెక్షన్లో ప్రచారం జరుగుతోందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.. ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు వారి వారి అధినాయకుల ప్లాన్ల ప్రకారం ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు . మరి ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది 14వ తేదీన  బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: