పాలు తాగుతున్న శిశువుకు ఊపిరి ఆడడం లేదని దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లగా..అప్పటికి ఆ శిశువు మరణించినట్లుగా వైద్యులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు సహజ మరణమే అనుకొని ఆ శిశువుకి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ శిశువు మరణం తర్వాత తన భార్య భారతి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయని.. కొడుకు మరణం పైన తండ్రికి అనుమానం రావడంతో సురేష్ తన భార్య అయిన భారతి మొబైల్ ని తనిఖీ చేయగా..ఆమె భాగస్వామిగా ఉన్న సుమిత్రతో ఉన్న ఫోటోలు వాయిస్ మెసేజ్లు కూడా బయటపడ్డాయి. ఈ ఆధారాలతో తన కొడుకుని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారంటు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సురేష్ పోలీసులకు అందించినటువంటి రికార్డుల ప్రకారం భారతి శిశువుని చంపినట్లుగా అంగీకరించింది. భారతి, సుమిత్ర గత మూడేళ్లుగా లెస్బియన్ బంధంలో ఉన్నారని, కానీ భారతీకి బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరు కలిసి గడపడానికి సమయం దొరకకపోవడంతో వారి బంధంలో గొడవలు సమస్యలు వచ్చాయని తమ ప్రేమకి అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ శిశువుని హత్య చేయాలని ప్లాన్ చేశారు. సుమిత్ర ప్లాన్ ప్రకారం భారతి తన కొడుకుని హత్య చేసినట్లు పోలీసులు బయటపెట్టారు. దీంతో భారతి, సుమిత్రను పోలీసులు సైతం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పై లోతుగా విచారణ చేయాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ దారుణమైన ఘటన విన్న తర్వాత తమిళనాడులో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి