జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది రెండు తెలుగు  రాష్ట్రాల ప్రజలకు చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయం లో ఎన్నికలకు సంబంధించి సంచలనమైన సర్వే లు బయటకు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలకు ఏ ఓటర్లు ఏ వైపు ఓట్లు వేశారు ఎవరు ఎటు వైపు మొగ్గు చూపారు అనేది క్లియర్ గా చెప్పుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరి లో నిలిచింది. బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ లో ఉన్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి  మహిళలు ఏ పార్టీ కి ఎంత మంది ఓట్లు వేశారు పురుషులు ఏ పార్టీ కి ఎంతమంది ఓట్లు వేశారు అనేది ఈ సర్వే  బయట పెట్టింది.. 

మరి ఈ సర్వే ప్రకారం ఏ పార్టీ గెలువబోతోంది అనేది తెలుసుకుందాం.. సాయి ఫణీంద్ర  అనే వ్యక్తి కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థ జెన్మెన్ అద్భుతమైన సర్వే ఫలితాలను బయటపెట్టింది. 41.25% పురుషులు కాంగ్రెస్ కి ఓటు వేశారని, 45% మహిళలు కాంగ్రెస్ కే ఓటు వేసారని తెలియజేశారు. బీఆర్ఎస్ కు 39.25% పురుషులు, 39.05% మహిళలు ఓటు వేశారని, బిజెపికి 13.25 %పురుషులు, 14-25% మంది మహిళలు ఓట్లు వేశారని అంటున్నారు.

ఇతరులకు 6.25%  పురుషులు, 5.75%   మహిళలు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. మొత్తం పోలింగ్  సరళిని గమనిస్తే కాంగ్రెస్ కే ఎక్కువ శాతం మంది ఓట్లు వేశారని ఈ సర్వే సంస్థ వారు కూడా తెలియజేశారు. కాంగ్రెస్ కు 42.5%, బీఆర్ఎస్ 40.5%, బీజేపీ 12.05%, మిగతాది ఇతరులకు వేసారని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే సంస్థ వారు కూడా బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: