ఆ లోహం ఏదో కాదు రాగి.. పెరుగుతున్న వాడకం, తగ్గుతున్న ఉత్పత్తి కారణంగా భవిష్యత్తులో బంగారం, వెండి కంటే కూడా రాగికి ఎక్కువ డిమాండ్ ఉండనున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే.. బెంగళూరుకి చెందిన సీనియర్ విశ్లేషకుడు సుజయ్ మాట్లాడుతూ.. "భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రాగి వెన్నెముకగా మారబోతోంది. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం, డేటా సెంటర్, చార్జింగ్ స్టేషన్, 5G టవర్, సోలార్ ప్యానెల్ ఇలా ప్రతి ఒక్కటి కూడా రాగిపై ఆధారపడ్డాయి. ఇప్పటికే రోజుకు వందసార్లు రాగిని ఉపయోగిస్తున్నారు.
పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రపంచం రాగి తీగలపై నడిచే విద్యుత్తుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి గనులలో ఒకటైన ఇండోనేషియాలోని గ్రాస్ బర్గ్ ప్రస్తుతం వరదలు, వరుస ప్రమాదాల వల్ల మూసి వేయబడింది. దీని ఫలితంగా 2026 నాటికి 600,000+ టన్నుల ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడనుంది. కొత్త రాగి గనుల ప్రారంభించడానికి మరో 15 సంవత్సరాలు పడుతుంది. ఇక దీనివల్ల రాగి లోహం లోపంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది" అంటూ ఆయన సూచించారు. ప్రస్తుతం రాగి కొరత ఇలాగే కొనసాగితే వచ్చే నాలుగు సంవత్సరాలలో రాగి ధర టన్నుకు 14 వేల డాలర్ల వరకు చేరుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా చైనా సౌర సబ్సిడీలను తొలగించింది. వైరింగ్, గ్రిడ్డులకు రాగి డిమాండ్ పెరగడం కారణంగా కూడా ఈ ధరలు పెరగనున్నట్లు తెలిపారు సుజయ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి