ఐపీఎల్ సీజన్లో ఆర్సిబి టీమ్ కప్ గెలవాలని సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు 18 ఏళ్లకు 2025 లో కప్ గెలుచుకుంది ఆర్సిబి.2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఆర్సిబి గెలిచింది. అయితే ఆర్సిబి కప్ కొట్టిన మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆ కప్ ను చూసేందుకు అవకాశం కల్పించారు. కానీ అక్కడికి తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి పెద్ద ఎత్తున రావడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. దీని కారణంగా ఏకంగా 11 మంది మరణించారు. ఈ ఘటనతో చాలామంది మీద కేసులు కూడా నమోదు అయ్యాయి.

ఈ ఘటన తర్వాత చిన్న స్వామి స్టేడియంలో కూడా ఎటువంటి మ్యాచులు జరగలేదు. ముఖ్యంగా అ స్టేడియంలో మ్యాచ్లను నిర్వహించడానికి ఇప్పటివరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదట. అంతేకాకుండా  వచ్చే ఏడాది జరిగే T -20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా చిన్నస్వామి స్టేడియాన్ని ఎంపిక చేయలేదని వినిపిస్తున్నాయి. దీంతో ఆర్సిబి  2026 లో ఐపీఎల్  హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపించలేదు. RCB మ్యాచ్లను మహారాష్ట్రలోని పూణేలో  స్టేడియంలో ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు తెలియజేస్తున్నారు.


ఇందుకు గల కారణం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఫలితమే అన్నట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే RCB తమ మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ లో ఆడక పోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి అవుతుంది. ఇది అభిమానులకు టీమ్ కి కూడా చాలా నిరాశే కలిగిస్తోంది. అంతేకాకుండా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అయిన కమలేష్ పిసాల్ ఇలా మాట్లాడుతూ.. పూణేలో ఆర్సిబి మ్యాచ్లను నిర్వహించడం పైన ఇంకా చర్చలు జరుగుతున్నాయని, మేమైతే మా స్టేడియాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. మరి ఏంటన్నది మరొక కొద్ది రోజులలో తేలుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: