ఎగ్జిట్ పోల్స్, సర్వేలు సైతం దాదాపుగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటూ అంచనా వేశాయి. 243 నియోజకవర్గాలలో 122 సీట్లు గెలిస్తే ఏ కూటమైనా సరే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కొన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయని చెబుతున్నాయి. కానీ ఏ ఒక్క సర్వే కూడా బీహార్లో కాంగ్రెస్ మహాగట్ బంధన్ కూటమి గెలుస్తుందని చెప్పలేదు. మళ్లీ నితీష్ కుమార్ కె అక్కడి ప్రజలు జై కొట్టారనే విధంగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కానీ గతంలో ఎగ్జిట్ పోల్స్ రెండుసార్లు నిజం కాలేదట. 2015లో ఒకసారి 2020లో ఒకసారి ఇలా జరిగింది. బీహార్ ప్రజలు సర్వే సంస్థలనే బురిడీ కొట్టించినట్లుగా తెలుస్తోంది.
2015లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో నితీష్ కుమార్ (JDU), కాంగ్రెస్, లాలు ప్రసాద్ యాదవ్ (RJD) కలిసి మహాగట్ బంధన్గా ఏర్పడ్డాయి. చాలా సర్వేలు ఎన్డీఏ కి ఆధిపత్యం ఉంటుందని చెప్పాయి. మహాఘాట్ బంధన్ 123 సీట్లు, ఎన్డీఏకు 110 కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ అక్కడ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంచనాలకు భిన్నంగా వచ్చాయి.. ఏకంగా మహాఘాట్ బంధన్ 178 స్థానాలలో తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఎన్డీఏ కేవలం 58 సీట్లకే పరిమితమైంది.
2020లో సర్వే సంస్థలన్నీ రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేతృత్వంలోనే మహాఘాట్ బంధన్ విజయం సాధిస్తుందని 125 సీట్లు అధికారంతో వస్తుందని అంజనా వేశాయి. కానీ బిహారీలు ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏకు 125 సీట్లను గెలిపించారు. అప్పుడు మహాఘాట్ బంధన్ 110 సీట్లకే పరిమితమైంది. ఇలా గత రెండుసార్లు బీహార్ ఎగ్జిట్ పోల్స్ నిజాం కాలేదు. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈసారి నిజం అవుతాయా లేదా చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి