దాదాపు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల కమిషన్ వారు ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో అనేక జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలా అవాంఛనీయలు సంఘటనలు జరగకుండా , జరిగిన అరికట్టడానికి ఎన్నికల సంఘం అనేక జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం చుట్టు పక్కల 144 సెక్షన్ ను ముందుగానే విధిస్తూ ఉంటారు.

దాని ద్వారా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్న చుట్టు పక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది అంటే ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనే దానిపై మొదటి గెలుపు సూచన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ద్వారా వస్తూ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోల్ అవుతాయో అతను గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ వరకు ఉంటాయి అని జనాలు నమ్ముతూ ఉంటారు. దానితో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తాయి అనే దానిపై పార్టీ అభ్యర్థులు , మామూలు ప్రజలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నిక జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన రానున్నాయి.

ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కానుంది. ఇక మొదట 30 నిమిషాలు అనగా 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించనున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ ఓట్లను సాధిస్తే వారికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని జనాలు నమ్ముతున్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లను తెచ్చుకుంటారు అనేది చూడాలి. ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ , బీ జే పీ మధ్య గట్టి పోటీ ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn