కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన విడుదల కానున్నాయి. ఇకపోతే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలు అయింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఎన్నికల సంఘం వారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు.

ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాల నుండి ఈ వి ఏం ఓట్లను లెక్కించబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది ఎవరు అనేది ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వారు విడుదల చేయనున్నారు. ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వారు మొదలు పెట్టారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన నవీన్ యాదవ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజ లో ఉన్నారు. కానీ ఎన్ని ఓట్లతో ఆయన ముందంజ లో ఉన్నాడు అనేది ఇప్పటివరకు సమాచారం అందలేదు. మరి కొంత సమయం లోనే ఆ విషయాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ ,  బీ జే పీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలను చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోరు నెలకొని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: