జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కి సంబంధించి గత కొన్ని నెలల నుంచి కసరత్తు జరిగింది. మొత్తం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎలాగైనా గెలవాలని అన్ని రకాలుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి ఇంకోవైపు బీఆర్ఎస్ చాలా కసరత్తులు చేసింది. అంతే కాకుండా ఎన్నికల్లో అభ్యర్థులను కూడా చాలా తెలివిగా నిలబెట్టి హోరా హురీగా పోరాటం చేశారు. ఇదే తరుణం లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ లో నిలిచారు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. మొత్తం నాలుగు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం లో కేవలం ఒక లక్ష 96,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 

48.47% మాత్రమే పోలింగ్ జరిగింది. ఇదే సమయంలో ఎన్నికల రిజల్ట్ కు సంబంధించి 42 టేబుల్ లలో 10 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఇదే సమయంలో షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మరి ఈయనకు ఎన్ని ఓట్ల ఆదిక్యం వస్తుంది అనేది చూద్దాం.. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం అనేది ఒక రెండు గంటల్లో పూర్తిగా బయటకు రానుంది.

 ముందుగా షేక్ పేట డివిజన్ లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే సమయంలో తొలి రౌండులో కాంగ్రెస్ కి ఆదిక్యం వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 8,926 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి. కేవలం 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలా చాలా తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: