తెలంగాణ రాష్ట్రం లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో కొన్ని రోజుల క్రితం ఉప ఎన్నికలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి అని ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ , ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బి ఆర్ ఎస్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉనికిని చాటుకుంటున్న బి జె పి మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అందులో భాగంగా చాలా రోజులు పాటు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ఈ మూడు పార్టీలకు సంబంధించిన పెద్ద వ్యక్తులు ప్రచారాలను నిర్వహించారు.

ఈ రోజు అనగా నవంబర్ 14 వ తేదీన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకు నుండి 8 గంటల 30 నిముషాల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆదిత్యంలో ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ధ్రువీకరించింది. 

ఇకపోతే కొంత సేపటి క్రితం ఏ వీ ఏం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం వారు మొదలు పెట్టారు. మొదట షేక్ పేట డివిజన్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నారు. ఇకపోతే ఈ ఓట్ల లెక్కింపును మొత్తం పది రౌండ్లలో ముగించబోతున్నారు. పదో రౌండ్ తో జూబ్లీ హిల్స్ ఒక ఎన్నికల్లో గెలిచింది ఎవరు అనేది తెలిసిపోతుంది. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనే దానిపై ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: