ఎంతో ఉత్కంఠ గా సాగుతున్నటువంటి బీహార్ కౌంటింగ్ కి సంబంధించిన ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో బీహార్ లో ప్రధానంగా  కాంగ్రెస్,బిజెపి మధ్య పోటీ ఏర్పడింది. మొత్తం 243 నియోజకవర్గాల్లో రెండు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందనేది చాలా ఉత్కంఠ గా మారింది. ఉదయం 8 కి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో రెండు పార్టీల నాయకుల మధ్య హోరా హూరీగా పోటీ ఏర్పడింది. ఇందులో ఏ కూటమి విజయం సాధించబోతుంది అనేది మరికొన్ని గంటల్లో బయటకు రాబోతోంది. మొత్తం 36 జిల్లాల్లో 48 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఏ పార్టీ లీడింగ్ లో ఉన్నది ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటింది అనేది చూద్దాం..

 బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షాలు మరియు మహాగట్ బందన్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. అంతేకాకుండా మూడవ స్థానంలో ప్రశాంత్ కిషోర్ నిలవ బోతున్నారు. మరి ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో లీడింగ్ ఉందనేది వివరాలు చూద్దాం.. మొత్తం ఎన్డీఏ మిత్ర పక్షాలు కలిపి 138 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అలాగే మహాగట్ బంధన్ 102 స్థానాల్లో లీడింగ్ ఉంది. అలాగే జేఎస్పి మూడు స్థానాలు, అదర్స్ ఒక స్థానంలో లీడింగ్ లో ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి.

 ఈ విధంగానే ఇంకో కొన్ని గంటలపాటు కొనసాగింది అంటే తప్పకుండా బీహార్లో ఎన్డీఏ మిత్ర ప్రక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఫలితం అనేది  ప్రస్తుతం వచ్చిన రిజల్ట్ బట్టి మాత్రమే ఉంది కానీ ఇంకా కొన్ని గంటల్లో మారే అవకాశం కూడా ఉందని వారు తెలియజేస్తున్నారు. మరి చూడాలి బీహార్లో జెండా పాతేది కాంగ్రెస్ పార్టీనా  లేదంటే భారతీయ జనతా పార్టీ పై స్థాయికి వెళ్తుందా అనేది మరికొన్ని గంటల్లో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: