కావాలనే ఆ ఇబ్బందిని పెద్దదిగా మార్చేశారు. తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం పట్ల ఆగ్రహించిన ఏజెంట్లు నిరసనకు దిగారు. “ఇంత పెద్ద ఉపఎన్నిక నిర్వహణలో కూడా ప్రాథమిక ఏర్పాట్లు సరిగా చేయలేదా?” అంటూ వారు ప్రశ్నించారు. ఈ నిరసన కారణంగా కౌంటింగ్ హాల్‌లో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే అక్కడ పోలీసులు వచ్చి పరిస్ధితి సర్ధు మణిగేలా చేశారు.
కొద్ది నిమిషాల పాటు ఆందోళన కొనసాగిన తరువాత, ఎన్నికల అధికారుల జోక్యంతో సమస్యను పరిష్కరించారు. అన్ని ఏర్పాట్లను సరిచేసి, ఏజెంట్లను తిరిగి హాల్‌లోకి పంపిన అనంతరం లెక్కింపును మళ్లీ ప్రారంభించారు.మొదట షేక్‌పేట్ డివిజన్‌కు చెందిన ఈవీఎంల లెక్కింపు చేపట్టారు. తాజా సమాచార ప్రకారం, తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల ప్రకటన వరకు ఇంకా ఎన్నో మలుపులు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి