ప్రజాధనం పట్ల లోకేష్ నిజాయితీ!
సాక్షి మీడియా ఎంతగా బురద చల్లాలని ప్రయత్నించినా.. నిజం నిప్పులా బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా తేలిందేమంటే.. లోకేష్ చేసిన ఆ ప్రయాణాలు ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన కాదట! అవి మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ వంటి తన శాఖల బాధ్యతలను నిర్వర్తించేందుకు చేసిన అధికారిక పర్యటనలే! అంతకంటే సంచలనం ఏమిటంటే.. ఈ అత్యంత ముఖ్యమైన అధికారిక పర్యటనల కోసం కూడా మంత్రి నారా లోకేష్ గారు తన శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. సొంత సొమ్మునే ఖర్చు చేశారు! ప్రజాధనం పట్ల ఒక ప్రజాప్రతినిధికి ఎంత బాధ్యత ఉండాలో లోకేష్ తన చర్యలతో చేసి చూపించారు.
జగన్ దోపిడీకి, లోకేష్ నిజాయితీకి తేడా ఇదే!
ఒకవైపు నారా లోకేష్ లక్షలాది రూపాయలు తన సొంత జేబు నుంచి ఖర్చు చేసి ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే.. మరోవైపు గత పాలకుడు జగన్ రెడ్డి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిన వైనం మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన వ్యక్తిగత పర్యటనలకు, సతీమణిని హైదరాబాద్‌లో దింపేందుకు కూడా హెలికాఫ్టర్లను, ప్రత్యేక విమానాలను సిటీ బస్సుల్లా వాడారు. ఆ ప్రయాణాలన్నింటికీ ప్రజాధనాన్నే వాడారే తప్ప.. ఒక్క రూపాయి కూడా సొంతంగా పెట్టుకోలేదు! అంతెందుకు.. తన సొంత ఇంటికి కూడా క్యాంపు ఆఫీసు పేరు చెప్పి కోట్లు ఖర్చు పెట్టి, కనీసం కిటికీలకు కూడా ప్రజాధనాన్నే ఉపయోగించుకున్నారు.
ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నాయకులు.. బాధ్యతగా సొంత డబ్బులు ఖర్చు చేసిన లోకేష్‌పై తప్పుడు ప్రచారంతో బురద చల్లే ప్రయత్నం చేశారు. నిజాయితీ, చిత్తశుద్ధి ముందు సాక్షి పత్రిక అబద్ధాల కట్టలు తెగిపోయాయి. ఇప్పటికే లోకేష్ కొన్ని అంశాలపై న్యాయపోరాటం చేస్తుండగా.. తప్పుడు ప్రచారాలకు సాక్షి యాజమాన్యం కోర్టులలో సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతోంది. నిజాయితీ గెలిచింది, బురద రాజకీయాలు పడిపోయాయి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి