పాదయాత్రే జగన్ మాస్టర్ స్ట్రోక్! :
గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన అనంతరం అధికారంలోకి వచ్చారు. ఆయన వారసుడిగా జగన్ కూడా 2017లో మొదలుపెట్టిన చారిత్రక ‘ప్రజా సంకల్ప యాత్ర’ (3,648 కి.మీ) సంచలనం సృష్టించింది. ఆ యాత్ర ఫలితమే 2019 ఎన్నికల్లో జగన్‌ను తిరుగులేని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు పవర్ పోయింది! అందుకే, జనంతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, క్యాడర్‌లో నైతిక స్థైర్యాన్ని నింపడానికి జగన్ మరోసారి తన ఫార్ములాను అమలు చేయబోతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పు తప్పదా? :
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి 'హనీమూన్ పీరియడ్' ముగిసిన తర్వాత ప్రజల సమస్యలపై యుద్ధం ప్రకటిస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ పోరాటానికి ఆయుధంగానే ఈ పాదయాత్ర ఉండబోతోంది. జిల్లా పర్యటనలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత, ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ఎండగట్టడానికి వీరుడు మళ్లీ కాలి నడకన జనం మధ్యకు రాబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ఎన్డీఏ పాలనలోని అన్యాయాలను సోషల్ మీడియా అస్త్రంగా వాడుకోవాలని ఆయన యూత్ వింగ్‌కు పిలుపునిచ్చారు.
చరిత్ర పునరావృతం అవుతుందా? :
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, పాలనా లోపాలు వంటి అంశాలపై నిరంతరం ప్రజల్లో ఉంటూ, జగన్ తన సొంత బలగాన్ని మరోసారి ఏకం చేయాలనే వ్యూహంతో ఉన్నారు. మనసుకు విశ్రాంతినివ్వకుండా, శరీరం సత్తువ ఉన్నంత కాలం పోరాడుతానని ప్రకటించిన జగన్... ఈ కొత్త పాదయాత్ర ద్వారా 2019 చరిత్రను మరోసారి తిరగరాయాలని చూస్తున్నారు. జగన్ చేయబోయే ఈ మహాయాత్ర రాబోయే రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించడం, అధికార పక్షానికి చెమటలు పట్టించడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి