ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన కొద్ది రోజుల క్రితం గోదావరి జిల్లాలలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడుతూ తెలంగాణ పై విమర్శలు చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు వాలిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని , తెలంగాణ నేతలు పచ్చని గోదావరి జిల్లాలను చూసి ప్రత్యేక రాష్ట్రం అడిగారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై అటు తెలంగాణ వాసులే కాకుండా రాజకీయ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శిస్తున్నారు.


ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో  పాటుగా బిఆర్ఎస్ నేతలు, తెలంగాణలో వివిధ పార్టీ నేతలు కూడా  ఫైర్ అయ్యారు. ఈ రోజున తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందంటూ హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకునేది లేదని వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ ఒక్క సినిమాను తెలంగాణ ప్రజలు ఆడనివ్వరంటూ తెలియజేశారు.



 ఇకనైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మానుకోవాలని, తెలంగాణలో ఉండే వనరులను వాడుకొని ఈ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ హెచ్చరించారు. మైలేజ్ పొందాలి అంటే పనితనంలో చూపించాలి, ఇలా కాదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం పవన్  వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా సరే కాస్త ఆలోచించి మాట్లాడాల్సి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సారీ చెబుతారా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: