గతంలో నేరుగా ఆయన విమర్శలు, బెదిరింపులకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయినా.. గుమ్మనూరులో మార్పు కనిపించడం లేదు. ఇప్పు డు ఏకంగా సొంత పార్టీలోనే ఎంపీకి బెదిరింపులు చేశారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై అధిష్టానం సీరి యస్‌గా ఉంది. అయితే.. బీసీ నాయకుడు కావడంతో ఏం చేయాలన్న విషయంపై పార్టీ అంతర్మథనం చెందుతోంది. గుమ్మనూరు ఎఫెక్ట్ ఆయనతోనే పోవడం లేదు.
పార్టీపైనా పడుతోంది. పార్టీలో చీలికలు కూడా వచ్చాయి.గతంలోనే తనను విభేదించేవారు.. తన కార్యాల యానికి రావాల్సిన అవసరంలేదని.. వార్నింగ్ ఇచ్చిన గుమ్మనూరు మీడియాను కూడా బెదిరించారు. ప్రధాన మీడియా రిపోర్టర్‌కు బహిరంగంగానే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కేడర్ ను కూడా ఆయన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇక, ప్రజల మధ్య కంటే కూడా.. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులోనే గుమ్మనూరు ఉంటున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.
ఈ పరిణామాలపై చంద్రబాబు దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడో రేపో.. ఆయనను పిలిచి మాట్లాడనున్నారని.. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తే.. ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే.. ఢక్కా ముక్కీలు తిన్న గుమ్మనూరు ఏమేరకు మారతారు..? ఏ మేరకు ప్రజలకు చేరువ అవుతారు? అన్నది చూడాలి. ప్రస్తుతం గుంతకల్లు రాజకీయాల్లో టీడీపీ హవా పెంచాలంటే.. గుమ్మనూరును అదుపు చేయాల్సిందేనన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి