తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసీఆరే సీఎంగా ఉన్నారు.. ఆయన పాలనను రెండు దఫాలు చూసినటువంటి జనాలు మూడవ దఫాలో బీఆర్ఎస్ ని పక్కన పెట్టేశారు. దీంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. రేవంత్ రెడ్డి చాకచక్య నిర్ణయాలతో మాట తీరుతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.  ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి బీఆర్ఎస్ పెద్ద నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. అంతేకాదు పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె కూడా బీఆర్ఎస్ నేతల భాగోతాలన్నీ బయట పెడుతూ వస్తోంది. ముఖ్యంగా తండ్రిని హైలెట్ చేస్తూ, ఆయన పక్కనున్న వారందరిని దయ్యాలతో పోలుస్తోంది. ఆ నేతల వల్లే కేసీఆర్ పార్టీ ఓడిపోయిందంటూ విమర్శలు చేస్తోంది.

 అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో కొంతమంది బడా నాయకులు చాలా కబ్జాలు చేశారని ఆరోపణలు కూడా చేస్తూ వస్తోంది. అలాంటి ఈ సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి కీలక ప్రకటన చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, వారందరిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు.. అయితే దీనిపై కేబినెట్లో చర్చించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో బడా నాయకులు ఎవరెవరు ఎంత ఆక్రమించారు..వారి ఆస్తులు ఎంతున్నాయి..

అక్రమాస్తులు ఏమైనా ఉన్నాయా..అనే దానిపై  విచారణకు సిద్ధం చేయబోతున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ విషయం కాస్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నేతలు అంతా వణికిపోతున్నారు.. అంతేకాదు ప్రభుత్వానికి దగ్గర ఉండటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేశారని కవిత ఆరోపించింది. దీంతో దూకుడు మీద ఉండే మల్లారెడ్డి కనీసం ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట కూడా అనకుండా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేతలతో కలిసి ఉంటూ  వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే  సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి  నేతలంతా భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: