ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయ కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థి చదువుల పైన తీవ్ర ప్రభావం చూపుతోందని విద్యాశాఖ అంచనా వేసింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఎస్సీ భర్తీ నిర్వాణకు సంబంధించి పోస్టులు ఎన్ని ఉన్నాయని ,రిజర్వేషన్ విధానం, అలాగే పరీక్ష విధానం పైన అధికారులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్చిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి డీఎస్సీ నియామకాలకు సంబంధించి విద్యాశాఖ మార్పును తీసుకువచ్చేలా పరిశీలిస్తోందట.
ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ విద్యకు ప్రత్యేకించి ప్రాధాన్యత కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఒక ప్రత్యేక పేపర్ ని కూడా ప్రవేశపెట్టేలా ప్రతిపాదన తీసుకువచ్చినట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిలబస్ తో పాటుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, స్కిల్స్ కంప్యూటర్ అవగాహన, డిజిటల్ లెర్నింగ్ వంటి అంశాల పైన కూడా పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ మార్పుకు సంబంధించి ఇంకా అధికారికంగా ఏపీ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నది. విద్యావ్యవస్థను ఆధునికరించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులను తీసుకురావాలనే భావనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడికి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఖచ్చితంగా ఉండాలనే అభిప్రాయంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ తేదీ, అర్హత విధానాలు, పరీక్ష విధానం పైన అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి