ఎప్పుడైతే కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిందో ఆ సమయంలోనే ఆమె పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి మాత్రం నాకెందుకు అని రాజీనామా చేసి రాజీనామా లెటర్ ని మండలి చైర్మన్ కి పంపింది.కానీ మండలి చైర్మన్ ఆమె రాజీనామా ఆమోదించకపోవడంతో రీసెంట్గా జరిగిన శాసన మండలి సమావేశంలో పాల్గొని తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా మండలి చైర్మన్ ముందు విన్నవించుకుంది.ఇక మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నిజామాబాద్ లో ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికల పెట్టాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ ఎమ్మెల్సీ గా కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి అజారుద్దీన్ ని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే అజారుద్దీన్ కి గవర్నర్ కోటాలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే అజారుద్దిన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల సమయంలోగా సభకి సభ్యుడిగా ఎంపిక కావాలి. లేకపోతే గవర్నర్ నుండి ప్రత్యేక ఆమోదం అయినా పొంది ఉండాలి.

అలా ఆరు నెలల్లోగా సభ్యుడిగా ఎన్నిక కావడం లేక గవర్నర్ నుండి ప్రత్యేక ఆమోదం ఈ రెండు మార్గాలు తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ ఎమ్మెల్సీ ఖాళీ అవ్వడంతో అక్కడి నుండి అజారుద్దీన్ ని ఎమ్మెల్సీగా పోటీ చేయించాలని చూస్తుందట. నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వడంతో అజారుద్దీన్ కి కలిసి వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి నిజామాబాద్ ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పోటీ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: