అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం కింద రూ.6000 రైతుల అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకం కోసం అప్లై చేయలేదొ వారు అప్లై చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అందుకు సంబంధించి అర్హతలు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలని విషయంపై ఇప్పుడు ఒకసారి చూద్దాం.
అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యుండాలి, అలాగే భూమి 5 ఎకరాల లోపు కలిగి ఉండాలి. దరఖాస్తు దారిని వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పట్టాదారని పాసుబుక్ కలిగి ఉండాలి , పంటకు సంబంధించి వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, మొబైల్ లింక్ యాక్టివేషన్ తో పాటుగా రైతు పేరు మీదే లింక్ అయి ఉండాలి. ఇక కౌలు రైతులు అయితే కౌలు రైతు గుర్తింపు పొందిన కార్డు ఉండాలి. అలాగే పట్టాదారుని పాసుబుక్ బ్యాంకు పాసుబుక్ సర్వే నెంబర్లు మొబైల్ నెంబర్ వంటివి తీసుకొని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారం సమర్పించిన తర్వాత అధికారులు పరిశీలించి అనంతరం లబ్ధిదారుల జాబితాలో పేరును చేరుస్తారు. ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే..http://anandathasukhibhava.ap.gov.in వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి