గ్రామస్థాయిలోని పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలను కూడా ఇప్పటికే సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్రామాలలోని పంచాయతీలకు సంబంధించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని 01-జనవరి-2026 ను అర్హత తేదీగా తీసుకొని ఓటర్ల జాబితాలను తయారు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అలాగే మున్సిపాలిటీలో కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇలా తయారు చేసిన ఈ ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోసమే ప్రత్యేకించి మరి ఈ ప్రక్రియను చేపట్టినట్లుగా ఎన్నికల సంఘం తెలియజేసింది.
దీంతో మార్చి 9వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురిస్తే ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నియోజవర్గాల వారిగా పునర్విభజన, జనగణన జరుగుతోంది, అయినా వీటితో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాది ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో అటు స్థానిక సంస్థల పదవి కాలం కూడా మరికొద్ది రోజులలో పూర్తికానుంది. అందుకే ఎలాగైనా ఈ ఏడాది ఎన్నికల నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో గ్రామస్థాయిలోని ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పలు రకాల వ్యూహాలను రచిస్తున్నారు. మరి ఎవరి బలం గ్రామస్థాయిలో ఎంతుందో మరో కొద్ది రోజులలో తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి