ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) పాలన సాఫీగానే కొనసాగుతోంది. ఎలాంటి విషయాలలో నైనా సరే చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది నేతలు మాట్లాడే మాటల వల్ల క్షేత్రస్థాయిలో కూడా విభేదాలు తారాస్థాయికి చేరేటట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన బిజెపి నేతల సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను సైతం మరొకసారి ఎత్తి చూపాయి.



ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటోంది. కులాలకు సంబంధం లేకుండా అందరిని కూడా సమానంగానే చూడాలి అంటూ పరోక్షంగా టిడిపి పార్టీ ప్రాధాన్యత పైన మాట్లాడినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సమానంగానే అవకాశాలు కల్పించాలని కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు అంటూ పరోక్షంగా టిడిపి పార్టీ వ్యవహరిస్తున్న తీరు పైన చురకలనిటించారు. ఈ విషయమే ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని సృష్టిస్తోంది.



కూటమిలో తమ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ బిజెపి మద్దతు లేనిది తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవని అసలు కూటమికి పునాది బిజెపి పార్టీ బిజెపి నేతలు అంటూ స్పష్టం చేశారు. కేంద్రంలో తన ప్రభుత్వం ఉన్నందువల్లే రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కారు వల్లే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ తెలియజేశారు. కూటమిలో బిజెపి పార్టీనే ప్రధానం అనే భావనని క్యాడర్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ తో పాటుగా మరి కొంతమంది నేతలు పాల్గొన్నారు. కూటమిలో ఎంత కష్టపడినా కూడా బిజెపి కేడర్ కు ఆశించే స్థాయిలో గుర్తింపు రావడం లేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పైన కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: