ఐఏఎస్, ఐపీఎస్ అంటే మామూలు ముచ్చట కాదు.ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలి అంటే ఎన్నో చదువులు చదివి ఉండాలి. ఎంతో కష్టపడితే గానీ ఐఏఎస్, ఐపీఎస్ లు కాలేరు.అయితే పెద్ద పెద్ద చదువులు చదివి ఎగ్జామ్ రాసి డబ్బులు ఖర్చు చేసి ఐఏఎస్, ఐపీఎస్ లు అవుతారు.కానీ ఎంతో చదువుకున్న ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఎలాంటి చదువు లేని రాజకీయ నేతల దగ్గర చేతులు కట్టుకొని నిల్చొని  రాజకీయ నాయకులు చెప్పింది విని తలాడిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాఖ్యలు 100% నిజం అనేలా మాట్లాడింది కాంగ్రెస్ మహిళా మంత్రి  కొండా సురేఖ.ఈ మధ్యకాలంలో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న కొండా సురేఖ తాజాగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఆ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. మేము రాజకీయాల్లో ఉంటున్నాం. రాజకీయాల్లో వేలిముద్ర గాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు.కానీ ఐపీఎస్,ఐఏఎస్ లు అవ్వాలంటే ఎన్నో చదవులు చదివి ఉండాలి. ఎంతో జ్ఞానం ఉండాలి. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్, ఐపీఎస్ లు కాలేరు. కానీ కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ లు అయినప్పటికీ చివరికి రాజకీయ నాయకులు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది..అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు 100% నిజం.ఎందుకంటే ఎంతో జ్ఞానం సంపాదించి చదువులు చదివి కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ లు అవుతారు.కానీ చివరికి రాజకీయ నాయకులు ఏం చెబితే దానికి తలాడిస్తూ ఉంటారు.

 తెలంగాణ హరితాభివృద్ధికి ఎఫ్సిఆర్ఐ గత పది సంవత్సరాల నుండి కీలక వేదికగా ఎదిగింది. వాతావరణ మార్పుల నియంత్రణ, అడవుల పరిరక్షణ, జీవవైవిద్య సంరక్షణలో నైపుణ్యం కలిగినటువంటి యువతను తయారు చేయడంలో ఈ సంస్థ అందరికంటే ముందంజలో ఉంది. ఈ సంస్థలోని ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీకి , మౌలిక వసతుల బలోపేతంపై ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి భర్తీ చేయిస్తానని కొండా సురేఖ మాట ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: