జాతీయ దర్యాప్తు సంస్థ మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన భారీ విధ్వంసాన్ని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వీరికి విచారణ లో రకరకాల విషయాలు తెలుస్తుండడం తో షాకింగ్ గా ఉంది. ఇస్లామిక్ స్టేట్ సంస్థ తరఫున పనిచెయ్యాలనే ఆసక్తి ఉంది అనీ అందుకే ఇబ్రహీం తో కలిసి టీం గా పనిచెయ్యడానికి ఒప్పుకున్నాను అనీ కానీ తాను ఇప్పటి వరకూ ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు అని దొరికిన ఉగ్రవాది హుస్సేనీ అలియాస్ యాసిర్ చెప్పాడు.

మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మ ద్ అథఉర్ రెహ్మాన్‌ల కస్టడీ గడువు ముగిసింది వారిని వైద్య పరీక్షల తరవాత నాంపల్లి కోర్టు లో హాజరు పరిచారు. వీరిలో రెహ్మాన్ నుంచి ఇంకా సమాచారం రాబతాల్సి ఉండగా కస్టడీ గడువు కోరారు పోలీసులు. దీనికి కోర్టు ఓకే చెప్పింది. మిగిలిన ముగ్గురినీ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల విధ్వంసాల కి కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ  ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్)’ మాడ్యూల్ కుట్రను అధికారులు గత నెల 29 న భగ్నం చేసి తరవాత 14 మందిని వేరు వేరు సందర్భాల్లో అరస్ట్ చేసారు.

 

 వీరిలో ఇప్పటి వరకూ ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మద్ అథఉర్ రెహ్మాన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క వృత్తిలో ఉండేవారు అని తెలుస్తోంది. పాతబస్తీ లో యాసిర్ ఖైరతా బాద్ లోని రెడీమేడ్ వస్త్ర దుకాణం లో ఉండేవాడు. మరొకతను రెహమాన్ స్థానికంగా ఇంగ్లీష్ ట్యూషన్ లు చెబుతూ ఉండేవాడు. విదేశాలకి వెళ్ళాలి అనుకునేవారికి పరీక్షలకి శిక్షణ ఇస్తూ ఉండేవాడు.

 

పోయిన సంవత్సరం ఇబ్రహీం ఇంట్లో అరబిక్ క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడు యాసిర్ పరిచయం అయ్యాడు. ఉగ్రవాద భావజాలం ఉండడం తో ఇద్దరూ కలిసి మాడ్యూల్ లో జేరారు. హ్యాండిల్ ఇచ్చే ఆదేశాల మేరకు హైదరాబాద్ తో పాటు చాలా ఇతర చోట్ల కుట్ర చేస్తున్నట్టు తెలుసుకున్నాడు. కలిసి పని చెయ్యడం తో తాను కూడా ఆసక్తి చూపించాం అని చెబుతున్నాడు. వారానికి ఒకరోజు సమావేశం అయ్యాం అనీ ఒకరోజు సడన్ గా మాడ్యూల్ చీఫ్ ఆమిర్ గా తనను ప్రకటించారు అని చెప్పాడు. నాందేడ్, అజ్మీర్, అనంతపురం సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విషయాన్ని ఆ తర్వాతే తనకు చెప్పారని, నిధుల సమీకరణలో మాత్రం కీలకపాత్ర పోషించానని వెల్లడించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: