"జీవితాశయం ప్రజాసేవ చేయటం. నిరాధార నిరుపేదలకు కనీస సాధారణ జీవితం అందించటం నా కర్తవ్యంగా భావిస్తాను. నా తండ్రి రాజశేఖరరెడ్ది ప్రారంభించిన ప్రజాసంక్షేమ, ఆర్ధిక అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటం నా లక్ష్యం" అంటూ డిల్లీలో జరిగిన ఇండియా టుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌ తో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ముచ్చటించారు. అలాగే ఇండియా టుడే ప్రశ్నలకు  వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు.

Image result for ys jagan India today conclave in delhi

మాకు ప్రత్యేక హోదా  మరియు ఇతర  రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వాటిని నెరవేర్చేటందుకు మద్దతు నిచ్చేవారికి మా మద్దతు జాతీయ స్థాయిలో ఉంటుంది.  ప్రత్యేక హోదా వస్తే 100 శాతం పన్ను రాయితీలు వాటంత అవే వస్తాయి అప్పుడే రాష్ట్రంలోకి పెట్టుబడులు పరిశ్రమలు ప్రవహిస్తాయి దాంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Image result for ys jagan India today conclave in delhi

వైసిపికి ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకునే అవసరం లేదు.  ఏ జాతీయ రాజకీయ పక్షం వైపూ మొగ్గేది లేదు. మా రాష్ట్ర ఆశయాల సాధనే ముఖ్యం. మేము తటస్థులం. మాకు ప్రత్యేక హోదా యివ్వటానికి ఏవరైతే ముందుకు వస్తారో వారికి జాతీయ స్థాయిలో సహకరిస్తాం అన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవసరం మాకు లేదు. మాకు రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్దే ప్రధానం.


జాతీయ రాజకీయాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించింది -  విభజన ప్రయోజనాలని అందించ కుండా బీజేపీ  రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఈ రెండు జాతీయ రాజకీయ పార్టీలతో సమ దూరం పాటిస్తూ జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి తెలిపారు.

Image result for ys jagan India today conclave in delhi

ఇండియా టుడే 18వ ఎడిషన్‌ ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష లకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం యిచ్చి అమలు చేయలేదని వైఎస్‌ జగన్‌ తప్పుబట్టారు.


పార్లమెంటు తలుపులు మూసేసి, మైకులు ఆపేసి, పార్లమెంట్ సభ్యులను సస్పెండ్‌ చేసి, లోక్‌-సభలో విభజన బిల్లును ఆమోదించారని, రాజ్యసభలో అన్ని పార్టీలు విభజనకు మద్దతు తెలిపి, అందుకు పరిహారంగా ఏపీకి  "ప్రత్యేక హోదా" ఇస్తున్నామని ప్రకటించాయని గుర్తు చేశారు. తలలేని మొండేం లాంటి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ఆవశ్యకమని వాటిని నెరవేర్చనందున అటు బిజేపి,  దానికి ముందే అనైతికంగా విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలతో, మాకు పనిలేదని నిష్కర్షగా చెప్పారు. ప్రత్యేక హోదా ఇప్పుడే కాదు 2014 నుండీ తమ జన్మ హక్కని అందుకే ఆ కార్యసాధనకు నిరంతరం కృషిచేస్తామని అది నేరవెర్చే జాతీయ పార్టీకే 2019 ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 

Image result for ys jagan India today conclave in delhi

ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిన ప్రాంతమే రాజధాని హైదరాబాద్‌ను తీసుకుపోయిందని, ఈ పరిస్థితిలో రాజధాని లేక, పెద్ద నగరాలు లేక ఏపీ యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. అందుకే ఏపీలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, పెద్దపెద్ద ప్రైవేటు ఆస్పత్రులు రావాలంటే ప్రత్యేక హోదా కచ్చితంగా ఉండాల్సిందేనని, పన్ను రాయితీలు, జీఎస్టి రాయితీలు ఉంటేనే ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు దేశ విదేశ ముందుకు వస్తాయని, అప్పుడు ఏపీలోని విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు ఆత్మాభిమానాన్ని చంపుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండబోదని వైఎస్‌ జగన్మోహనరెడ్డి  వివరించారు.

Image result for chandrababu puchased CRDA lands before capital plan

Land 'scam' hits Amaravati before its formation

ఓటుకు నోటు కేసులో ప్రపంచం ముందు వీడియో ఆడియోల సాక్షిగా బుక్ అయి, తెలంగాణా ఏసిబి చేత కేసు నమోదవగా అమరావతి పారిపోయిన చంద్రబాబుకు నీతి నిజాయతీ గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని చెప్పారు. ఆరు నెలల కిందట చంద్రబాబు అవినీతిపై ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క పుస్తకాన్ని విడుదల చేసిందని, దాని మీద రాహుల్‌గాంధీ బొమ్మ కూడా ఉందని గుర్తు చేశారు.


చంద్రబాబును అత్యంత అవినీతిపరుడైన సీఎంగా అభివర్ణించిన కాంగ్రెస్‌ పార్టీ మూడు నెలలు తిరగకముందే తెలంగాణ ఎన్నికల్లో అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్లిందని, ప్రజలు ఆ పార్టీలను ఓడించి పంచించారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేశామని, తనకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేసినా, తాము కేవలం ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయామని గుర్తుచేశారు.

Image result for chandrababu puchased CRDA lands before capital plan

ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు కదా? ప్రశ్నించగా రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. జూన్‌ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు. అయినా, ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుందంటూ ఆయన ప్రజలు మభ్యపెట్టారు.


ఈ లోపల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువధరకు భూములు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి రాజధాని ఎక్కడ వస్తున్నదనేది రహస్యంగా ఉంచాలి. కానీ, చంద్రబాబు ఈ విషయాన్నితన వాళ్లకు ముందే లీక్‌ చేశారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో సమానం. ల్యాండ్‌ పూలింగ్‌ విషయలో చంద్రబాబు పెద్ద కుంభకోణాని కి పాల్పడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట రాజధాని కోసం పేదల నుంచి మాత్రమే భూములు లాక్కున్నారు. తన బినామీల భూములు, తన భూములు ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా చూశారు. దేశం ఇలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసిందా?

మరింత సమాచారం తెలుసుకోండి: