పోలింగ్ రేపే జరగనున్నడంతో సమస్యాత్మక ప్రాంతాలల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పులివెందులో ఏకంగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం ఆసక్తిని రేపుతోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లో పులివెందులను ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనితో ఈ రోజే అక్కడ భారీ పోలీసు బలగాలతో దిగిపోయారు. 


దీనితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 20 మంది డిఎస్పీలు, 40 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ విధుల్లో పాల్గొన్నారు. జిల్లాఎస్పీ మాట్లాడుతూ కేంద్రంలో ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎవరైనా ప్రలోభాలు పెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఇప్పటికే భారీగా నలభై లక్షలు వరకు డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఎక్కడైనా సమస్యలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే రేపు పొద్దున్నే ఎన్నికలు జరగడంతో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికి ఈసీ విజ్ఞప్తి చేసింది. ఈ సారి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: