సాధారణంగా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము అంటే ఎవరికైనా భయమే..అలాంటి పామును భారత దేశంలో దేవతగా పూజిస్తుంటారు. ఇక పాము నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు, సీరియల్స్ వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. ఏ ఆలయాలకు వెళ్లినా నాగదేవత విగ్రహాలు ఉంటాయి. నాగుపాము అంటే ఎంత భయపడతారో అంతగా పూజిస్తుంటా భారతీయులు.
అలాంటి నాగు పాములతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంక గాంధీ ఆటలాడుకోవడం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాయ్ బరేలీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, పాములు పట్టేవారిని కలుసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొన్ని పాములను తన చేతుల్లోకి తీసుకున్నారు. వాటిని పట్టుకునే సమయంలో ఆమెలో ఏ మాత్రం భయం కనిపించలేదు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి ప్రయెగాల వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారు..అదే సమయంలో ప్రియాంక ధైర్యాన్ని మాత్రం తెగ పొగిడేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.