నేటి మంచిమాట.. అసత్యంతో సాధించిన విజయం కంటే.. సత్యంతో సాధించిన పరాజయమే మేలు! అవును.. అబద్దం చెప్పి తాత్కాలిక విజయం కంటే కూడా నిజం చెప్పి ఓడిపోవడం మేలు. నిజం చెప్తే ఎం అవుతుంది? మహా అయితే ఒకసారి ఓడిపోతావు. మళ్లీ అయితే ప్రయత్నించేకి అవకాశం ఉంటుంది కదా!

 

అదే అబద్దం చెప్పి విజయం సాధించినట్టు ఫిల్ అయ్యావు అంటే నిజమైన విజయం సాధించడానికి నీకు అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పు ? ఎన్ని సార్లు ఒకేదాని కోసం ఎన్ని సార్లు ప్రయత్నిస్తావు? విజయం సాధించావు కదా అని అంటారు. అందుకే నిజం చెప్తే నీకు నచ్చిన దానిలో ఒకసారి ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తావు. 

 

అందుకే ఎప్పుడు కూడా తప్పు మనదే ఉన్నప్పటికీ మనం నిజం ఏ చెప్పాలి. ఆ నిజం చెప్పడం వల్ల ఏం అవుతుంది? మహా అయితే ఒక తిట్టు తిడుతారు.. ఒకసారి కొడుతారు. అంతే కదా! చంపారు కదా! అందుకే ఓడిపోయినా.. గెలిచినా నిజమే చెప్పండి. అబద్దం చెప్పి గెలవడం కంటే కూడా నిజం చెప్పి ఓడిపోవడమే ఎంతో మంచిది. 

 

నిజం చెప్పాలి అంటే భయం వేస్తుంది. కానీ ఆ ఒక్కసారి దైర్యం చేసి నిజం చెప్తే జీవితాంతం మనం ఎంతో దైర్యంగా బ్రతకచ్చు. అదే మనం అబద్దం చెప్పాము అంటే ఆ విషయం గుర్తు వచ్చిన ప్రతి సారి మనం బాధపడాలి. భయపడాలి. ఎప్పుడు ఆ నిజం బయటపడుతుందో.. నా జీవితం ఏం అవుతుందో అనే భయం ఉండనే ఉంటుంది. అందుకే నిజం నిర్భయంగా చెప్పి దైర్యంగా బ్రతకండి.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: