ఈ సామెతను ఆధారంగా తీసుకొని,  నేను మీకు ఒక చిన్న కథను వినిపిస్తాను.. అదేమిటో ఇప్పుడు చూద్దాం..

ఒకసారి దేవ దేవేంద్రుడు ఇంద్రుడు.. రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెంది, వెంటనే రైతులతో మాట్లాడుతూ.. "  నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు. కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు.. " ఈ మాట విన్న రైతులంతా కలసి,  ఇంద్రుడిని వేడుకోగా.. అప్పుడు ఇంద్రుడు సరే, పరమశివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది. అని వరం ఇచ్చి వచ్చే 12 సంవత్సరాల పాటు డమరుకం వాయించవద్దని శివునితో రహస్యంగా చెప్తాడు..

ఇక  అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు చెప్పినట్టు పరమశివుడు కూడా వినాలి. ఇక ఇంద్రుడు చెప్పాడు కదా అని, పరమశివుడు కూడా అందుకు తగ్గట్టు నడుచుకున్నాడు. ఇక రైతులంతా పరమశివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా 12 సంవత్సరాల తర్వాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు. ఇక రైతులు ఏం చేయాలో తెలియక 12 సంవత్సరాలు గడవడం కోసం వారు వేచి చూడసాగారు..

కానీ ఒక రైతు మాత్రం తన పనులను విరమించకుండా, తోటి రైతులు ఎగతాళి చేస్తున్న లెక్కచేయకుండా,  ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే పొలం దుక్కిదున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వచ్చాడు. మూడు సంవత్సరాల తరువాత కూడా ఎప్పటిలాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారందరూ కలిసి వెళ్లి అతడితో వర్షం పడదు, అని తెలిసి కూడా ఎందుకు సమయం అలాగే శ్రమ వృధా చేస్తున్నారు అని అడిగారు..

దానికి ఆ రైతు వర్షం లేకుంటే పంట పండదు అని నాకు కూడా తెలుసు. కానీ తీరా 12 సంవత్సరాల తర్వాత వర్షం కురిసినప్పటికి వ్యవసాయ పనులు మరిచిపోకుండా ఉండేందుకు మాత్రమే నేను ఈ పనులు చేస్తున్నాను అని చెప్పాడు ఆ రైతు..


ఇక ఈ విషయాన్ని అంతా విన్న పార్వతీదేవి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి, తమరు డమరుకం వాయించడం మరిచిపోలేదు కదా.. అని చమత్కారంగా..  అడిగింది. ఇక అంతటి పరమశివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.. ఇక తక్షణమే వర్షం కురవడం ప్రారంభమయింది.. ఆ రైతు కల ఫలించింది. ఆ రైతు పొలంలో పంట బాగా పండి, మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది..


కాబట్టి చూశారు కదా.. ప్రస్తుతం కూడా మన జీవితంలో కూడా ఇలాంటి మార్పులు సంభవిస్తున్నాయి. కరోనా విజృంభించిన తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ మనం చేస్తున్న వృత్తి, వ్యాపారం ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాన్ని అలాగే జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మన పనులను మనం ఎప్పటికీ మర్చి పోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: