మనలో చాలామంది స్థాయిని బట్టి మనిషిని గౌరవిస్తూ వుంటారు. కానీ అలా చేయడం తప్పు అని తెలిసి కూడా వారు డబ్బుకు, హోదా కు మాత్రమే  విలువ ఇస్తారు.  అలాంటి వారి కోసమే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక నిజ జీవితంలో జరిగిన  సంఘటన. అయితే ఆ సంఘటన  ఏమిటో ఇప్పుడు మీరు కూడా ఒకసారి చదివి తెలుసుకోండి..

ఒకానొక సమయంలో భారతదేశానికి చెందిన  విజయసింగ్ అనే రాజు ఒకసారి ఇంగ్లాండ్ దేశాన్ని  పర్యటించారు. అలా పర్యటిస్తున్న సమయంలో ఒక మామూలు వ్యక్తిలా, అక్కడ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా , ఆయనను రోల్స్ రోయ్స్ షోరూం లోని ఒక కారు ఆయనను బాగా ఆకర్షించింది. ఇక దాన్ని కొనాలన్నా ఆశతో వివరాలు కనుక్కోవాలని షోరూంలోకి వెళ్లగా,  అక్కడ పనివారు ఇది ఒక సాధా సీదా పేద దేశస్థుడైనటువంటి భారతీయుడు కొనే అంత తక్కువ కాదు , అని మన భారతదేశం గురించి చాల చులకనగా మాట్లాడి ,ఈయనను అవమానించి అక్కడ నుండి తరిమేశారు.


ఆ తరువాత ఆయన తాను బస చేస్తోన్న హోటల్ కు వెళ్లి, ఒక  రాజులా దుస్తులు ధరించి, మళ్ళీ షోరూం కు చేరుకున్నారు . ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో, ఎర్ర తివాచీతో స్వాగతం పలికి, పుష్పగుచ్చని అందించారు. అపుడే అవమనించిన అక్కడి పనివారు ముందు , ఎలాంటి వాయిదాలు లేకుండా ఒకే సారి డబ్బు మొత్తం చెల్లించి 6 కార్లను కొనేశారు. అవి మన భారతదేశానికి చేరుకోగానే వాటిని మన దేశంలో వీధులలోని చెత్తను శుభ్రపరిచే వాహనాలుగా ఉపయోగించాలని తన నాయకులకు ఆదేశాలు జారీచేశారు.

కాలగమనంలో ఆ మాట.. ఈ నోటా ఆ నోటా పాకి ప్రపంచం అంతా  తెలిసింది. యూరోప్ , అమెరికా వంటి దేశాల్లో ఎవరైనా ఈ రోల్స్ రోయ్స్ కార్ కొన్నానని గొప్పలకు పోతే, ఆ కారు,  భారతదేశంలో చెత్త బండి అని హేళన చేసే వరకు దిగజారిపోయింది.
దాంతో ఆ కార్ల కొనుగోలు తగ్గిపోవడం, ఆ యాజమాన్యానికి కారణం తెలియడంతో , ఆ యాజమాన్యం రాజా విజయసింగ్ గారికి ఒక లేఖను పంపారు. మీరు మా కార్లతో చెత్త ను తీయడం ఆపేయండి. అందుకు బహుమానంగా మరో 6 కార్లను మీకు మేము ఉచితంగా పంపిస్తాం అని తెలిపింది ఆ యాజమాన్యం.

అందుకు రాజు గారు ఇలా సమాధానం ఇచ్చారు..
"అయ్యా !  నాకు మీ కార్లపైనా ఎటువంటి కోపం లేదు.
మీ పని వారు నా దేశాన్ని ఒక చెత్త లా మాట్లాడి తీసిపారేసారు. ఆ కోపం తోనే మీ కార్లను నా దేశంలో చెత్తను తీయడానికి ఉపయోగించాను. మొదట మనిషిని మనిషిగా గౌరవించడం మీ పనివారికి నేర్పించండి." అని సమాధానం గా  తిరిగి మరలా లేఖ పంపారు రాజు గారు..

కాబట్టి ప్రతి ఒక్కరు స్థాయిని, హోదాని  విడిచిపెట్టి మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: