
రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవలే రైల్వేస్ తో మొదలైన మ్యాచ్లో బౌలర్ లకు చుక్కలు చూపించాడు మనీష్ పాండే. సుదీర్ఘ ఫార్మాట్ లో కూడా టి20 తరహాలో విధ్వంసం సృష్టిస్తు అందరి దృష్టిని ఆకర్షించాడు. సింగిల్స్ తీయడం కాదు ఏకంగా బౌండరీలు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు మనీష్ పాండే. 121 బంతుల్లో ఏకంగా 156 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇక మరోవైపు ఎండ్ లో ఉన్న కృష్ణమూర్తి సిద్ధార్థ సైతం 221 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయంగా శతకం సాధించాడు..
ఇకపోతే మనీష్ పాండే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. దీన్నిబట్టే మనీష్ పాండే ఎంత విజృంభించాడు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేయడం గమనార్హం. అయితే మనీష్ పాండే అద్భుతమైన ఇన్నింగ్స్ అటు ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి సంతోషాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే మెగా వేలంలో మనీష్ పాండేను 4.5 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో. కాగా లక్నో జట్టుకి కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.