ఈసారి ఐపీఎల్ ఎలా ఉండబోతుందో అని అటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ప్రతీ జట్టులోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో రెండు కొత్త జట్లు కూడా ఎంట్రీ ఇచ్చాయ్. దీంతో ఇక ఈ అనూహ్యమైన మార్పుల తర్వాత ఏ జట్టు ఎలా రాణించ పోతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది. అయితే ఇక ఈసారి ఐపీఎల్ లో రాణించి మరోసారి కప్పు కొట్టాలని అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్స్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ కు సంబంధించి సన్నాహాలు ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది.


 మార్చి 26వ తేదీ నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముంబై వేదికగా ప్రారంభం కాబోతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది రన్నరప్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ తలబడిపోతుంది. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని జట్టుకు మార్గనిర్దేశం చేసేందుకు రంగంలోకి దిగాడు అని తెలుస్తోంది. భారత మాజీ పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సహాయక సిబ్బంది తో పాటు  ధోని ఇటీవలే సూరత్ లో అడుగుపెట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీం మేనేజ్మెంట్ సూరత్ లో ఫ్రీ సీజన్ క్యాంపును ప్రారంభించాలని నిర్ణయించుకుంది అంటూ గతంలో చెప్పిన  విషయం తెలిసిందే.


 మార్చి 8వ తేదీ నాటికి ఇక ఈ శిక్షణ క్యాంపు ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దులో సూరత్ వుండగా ఇక మొత్తం ఐపీఎల్ సీజన్ ముంబై పూనెలలో జరగబోతుంది. ఇక ధోని అందరి కంటే కాస్త ముందుగానే రంగంలోకి దిగి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధం అవడంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: