
ఇలా ఐపీఎల్ లో సత్తా చాటిన ఇక అటు వెంటనే టీమిండియాలో అవకాశాలు దక్కించుకుని ఇక ఇప్పుడు సార్లు గా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రవిచంద్రన్ అశ్విన్ : టీమిండియా సీనియర్ బౌలర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ ద్వారానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ మొదటి సీజన్ లోనే విశ్వరూపం చూపించి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న అశ్విన్ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా లోకి వచ్చిన తర్వాత తన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రవీంద్ర జడేజా : 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అప్పట్లోనే రాజస్థాన్ జట్టుకు కెప్టెన్గా ఉన్న షేన్ వార్న్ జడేజా స్టార్ ప్లేయర్ అవుతాడు అని చెప్పాడు. అన్నట్లుగానే ఇప్పుడు స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా.
జస్ప్రిత్ బూమ్రా : అతి తక్కువ సమయంలో ఐపీఎల్ ద్వారా స్టార్ ప్లేయర్ గా మారింది ఎవరు అంటే జస్ప్రిత్ బూమ్రా అని చెప్పాలి. 2012, 13 సీజన్లు ఐపీఎల్ లో అదరగొట్టిన బుమ్రా ఐపీఎల్ తొలి సీజన్ లోనే తన వెరైటీ పోలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీమిండియా లోకి వచ్చి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
హార్దిక్ పాండ్యా : 2012లో బరోడా తరఫున బరిలోకి దిగాడు హార్దిక్ పాండ్య. 2012 నుంచి ఐపీఎల్ 2015 లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా ఎలా ఎదిగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లతో పాటు శిఖర్ ధావన్, మనీష్ పాండే,అక్షర్ పటేల్,మహ్మద్ షమి, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ నటరాజన్ ఇంకెంతో మంది ఆటగాళ్లకు ఐపీఎల్ టీమ్ ఇండియా లో కి వెళ్లడానికి దారి చూపించింది ఐపీఎల్ అని చెప్పాలి.