ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అటు అంపైర్లు  కూడా ఎంతో ఒత్తిడిలో ఉంటారూ. ప్రతి బంతిని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ సరైన తీర్పు ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు అంపైర్లు చేసే చిన్న పొరపాట్లు, తీసుకునే నిర్ణయాలు అటు మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. అప్పడప్పుడు ఇలాంటివి ఐపీఎల్ లో జరుగుతూ హాట్ హాట్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెల్సిందే. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది.


 కొన్నిసార్లు డిఆర్ఎస్ తీసుకున్న సమయంలో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటు ఉంటారు. అయితే ఇక్కడ తప్పుడు నిర్ణయం ఇవ్వలేదు కానీ డిఆర్ఎస్ తీసుకోవడం విషయంలోనే వివాదం నెలకొంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చివరి క్షణంలో సన్రైజర్స్ హైదరాబాద్ డి ఆర్ ఎస్  తీసుకోవడంతో ఈ వివాదం తెరమీదికి వచ్చింది. నటరాజన్ విసిరిన బంతి పంజాబ్ ఆటగాడు ప్రబ్ సిమ్రాన్ ప్యాడ్స్ కు తాకి కీపర్ చేతిలోకి బంతి వెళ్ళింది. దీంతో డిఆర్ఎస్ కౌంట్ డౌన్ జీరో టైం లో కేన్ విలియమ్సన్ రివ్యూ కోరాడు. దీన్ని మరో ఆటగాడు బెయిర్ స్ట్రో వ్యతిరేకించినప్పటికీ అంపైర్ రివ్యూ కి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఎల్బీడబ్ల్యూ కోసం  వెళ్లగా.. కూడా చివరికి క్యాచ్ అవుట్ కావడంతో  అంపైర్ అవుట్ గా ప్రకటించారు.


 దీంతో పంజాబ్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి. హైదరాబాద్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కేవలం 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో తెలుగు అభిమానులు అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: