ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తప్పు చేశాడు.. జట్టును సారథిగా ముందుకు నడిపిస్తున్న సమయంలో ఆ మాత్రం తెలివిగా ఆలోచించకపోతే ఎలా.. ఢిల్లీ క్యాపిటల్స్  ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించడానికి రిషబ్ పంత్ ఒక్కడే కారణం అంటూ ప్రస్తుతం ఎంతోమంది చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంజరిగిందో దాదాపు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి చర్చించుకుందాం.. ఇటీవలే ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ జట్టుకు అది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఆ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.


 దీంతో ఢిల్లీ జట్టు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో రిషబ్ పంత్ చేసిన కొన్ని తప్పిదాల కారణంగా ఢిల్లీ వైపు ఉన్న మ్యాచ్ కాస్తా ముంబై వైపు టర్న్ అయ్యింది   ఇక మ్యాచ్ మొత్తంలో ఒక రివ్యూ రిషబ్ పంత్ తీసుకోకపోవడం వల్లే ఢిల్లీ ఓడిపోయింది అని చెప్పొచ్చు. ముంబై బ్యాట్స్మెన్ టీమ్ డేవిడ్ బ్యాట్ అంచుకు బంతి తాకుతూ పంత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పీల్ చేసిన అటు ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్గా ప్రకటించాడు. దీంతో సమీక్షకు వెళతారని అందరూ అనుకున్నారు. కానీ రిషబ్ పంత్ మాత్రం ఆ పని చేయలేదు. చివరికి విమర్శలు మూటగట్టుకున్నాడూ.


 ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రిషబ్ పంత్. వికెట్లకు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్న వాళ్లు బ్యాట్ కు తాకలేదు అని చెప్పడం కారణంగానే రివ్యూకు వెళ్లకుండా ఆగిపోయాను అని తెలిపాడు. మొదట బంతి  బ్యాట్ అంచుకు తాకినట్లనిపించింది. రివ్యూ కి వెళ్లాలని సమీపంలోని ఫీల్డర్లను అడిగితే వాళ్ళు సుముఖత చూపలేదు.  రివ్యూ తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి ఇలా రివ్యూ తీసుకోకపోవడం వల్ల సేవ్ అయిన టీమ్ డేవిడ్ ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 65 పరుగులు చేసి విజయాన్ని అందించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl