
మొదట ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన జట్టుగా నిలిచిన గుజరాత్ తొలి క్వాలిఫయర్లో గెలిచి మొదట ఫైనల్లో అడుగుపెట్టిన జట్టు గా నిలిచింది. అంతేకాదు ఇక మొదటి సీజన్ లోనే తమ మొదటి టైటిల్ అందుకున్న జట్టుగాను గుజరాత్ టైటాన్స్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్థిక్ పాండ్య పై ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ గుజరాత్ టైటాన్స్ విజయానికి తెరవెనుక ఉండి నడిపించేది హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడూ.
ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ హెడ్ కోచ్ గా రికార్డు సృష్టించాడు ఆశిష్ నెహ్రా. ఇప్పటివరకు ఐపీఎల్లో 14 సీజన్లో టైటిల్ గెలిచిన ప్రతి జట్టుకు కూడా హెడ్ కోచ్గా విదేశీ వ్యక్తే వ్యవహరించాడు. కానీ కానీ ఇప్పుడు మాత్రం హెడ్ కోచ్గా ఆశిష్ నెహ్రా ఉండగా గుజరాత్ టైటిల్ గెలిచింది. ఐపీఎల్లో ప్లేయర్గా హెడ్ కోచ్ గా టైటిల్ సాధించిన మూడవ క్రికెటర్గా ఆశిష్ నెహ్రా నిలిచాడు అని చెప్పాలి. గతంలో రికీ పాంటింగ్, షేన్వార్న్ టైటిల్స్ విజేతగా నిలిచారు. 2016లో టైటిల్ విజేతగా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆశిష్ నెహ్రా ఆటగాడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు గుజరాత్ జట్టు హెడ్ కోచ్గా టైటిల్ విషయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి..