ప్రస్తుతం స్పెయిన్ వేదికగా హాకీ ప్రపంచ కప్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా ప్రతి మ్యాచ్  కూడా ఎంతో హోరాహోరీగా జరుగుతోంది. కాగా మొన్న జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారత జట్టు నిరాశపరిచింది. కానీ ఇప్పుడు మాత్రం మహిళా హాకీ ప్రపంచ కప్లో టీమ్ ఇండియా జట్టు అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన భారత మహిళల హాకీ జట్టు  వరుసగా మ్యాచ్ లను డ్రాగా ముగించింది.


 కానీ ప్రపంచకప్లో భోని మాత్రం కొట్టలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు ఇంకా మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నప్పటికీ భారత మహిళల హాకీ జట్టు మాత్రం ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం   అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెనడా జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. 9 నుంచి 16 స్థానాల కోసం ఇటీవల జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ సవిత పూనియా సేన షూటౌట్ లో 3-2 తో ఘన విజయం అందుకుంది.


 ఈ మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఈరోజు జట్లు కూడా 1-1 గా నిలిచాయి. కానీ ఆ తర్వాత షూటౌట్ రౌండ్ లో మాత్రం టీమిండియా కెప్టెన్ సవితా గోల్ పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్ లో భారత్ కు విజయాన్ని అందించింది. ఇక మొత్తం మ్యాచ్ మీద ఆర్ గోల్స్ ని ఎంతో చాకచక్యంగా అడ్డుకుంది సవితా.  ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో మొదటి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక భారత అభిమానులు అందరూ కాస్త సంతృప్తి చెందుతున్నారు. భారత జట్టు అటు హాకీ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా   అద్భుతమైన ప్రదర్శన చేసి గెలిచింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: