
విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగానే విరాట్ కోహ్లీ ఫాం పై చూపింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కొంతకాలంగా సరైన ప్రదర్శన ఇవ్వనప్పుడు కోహ్లీ స్థాయి ఆటగాడు కాకపోయినా చర్చ జరుగుతోంది. రోజు మీడియాలో కనిపించడం సర్వసాధారణం అవుతుంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా కేవలం ఆట మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే రాణించేందుకు అవకాశం ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ లో మీరు ఎలా ఉన్నారు. మీ జట్టు సభ్యులతో ఎలా కలిసిపోతున్నారు.. యాజమాన్యం సెలెక్టర్లు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు.. మిగతా వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పుకుంటే పరుగులు చేయకపోయినా టీమిండియా తరఫున ఆడుతూనే ఉంటాడు అని ఎక్కడా చెప్పలేదు. అయితే ఇప్పటి వరకు చేసిన అద్భుతమైన ప్రదర్శన వల్ల అతనికి అదనపు అవకాశాలు వస్తున్నాయి. అతని వయస్సు 33 ఏళ్లు.. అతనికి ఏ ఫిట్నెస్ సమస్య కూడా లేదు. తప్పకుండా మళ్లీ ఫామ్ లోకి వస్తారు అని అందరూ అనుకుంటున్నాడు. త్వరలో అతడు మళ్ళీ ఫాంలోకి వస్తాడని ఆశిస్తున్నాను. అయితే అతనికి కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ పరుగులు చేయాలని కోరుకునే వారిలో నేను మొదటి వ్యక్తిని. విశ్రాంతి తీసుకోవడం తప్పేమీకాదు. ఇక విరామం లేకుండా ఆడటమే విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆశిష్ నెహ్ర.