
ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రికెటర్ కూడా ఆ కోవకు చెందిన వాడే. అతని పేరు రాజా బాబు ప్రస్తుతం ఘజియాబాద్లో ఈ రిక్షా నడుపుతూ పాలు అవుతున్నాడు. 2017 లో జాతీయ పోటీల్లో ఉత్తరప్రదేశ్ తరఫున ఢిల్లీ పై 20 బంతుల్లో 67 పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. మీరట్ లో జరిగిన హౌసా లోన్ కి ఊడన్ పోటీలో 50 పరుగులు చేసి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక స్థానిక వ్యాపార వేత్త అతని ప్రతిభకు మెచ్చి ఏకంగా ఈ - రిక్షా బహుమతిగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే అతనికి జీవనోపాధిగా మారిపోయింది. ఘజియాబాద్ లో ప్రస్తుతం రిక్షా నడుపుతూ పాలు అమ్ముతూ జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా రాజబాబు కెరీర్ ని నాశనం చేసింది అని చెప్పాలి. కరోనా సంక్షోభం ముందు దివ్యాంగ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రంలోని వికలాంగ క్రికెటర్ కు సహాయం అందుతూ ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంగా 2020లో కార్యకలాపాలను నిలిపి వేసింది. రాజబాబు లాంటి క్రికెటర్లు ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనతో పాటు తన సహచరులు కూడా మీరట్ లోని వికలాంగుల దాబా లో డెలివరీ ఏజెంట్ లుగా పనిచేసేవారు అంటూ చెప్పుకొచ్చారు రాజబాబు. అతనికి భార్య నిది, పిల్లలు కృష్ణ, శాంతి ఉన్నారు.