
కానీ మూడో వన్డే మ్యాచ్లో మాత్రం అటు జింబాబ్వే జట్టు అనూహ్యంగా పుంజుకోవడంతో మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది అని చెప్పాలి. జింబాబ్వే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. జట్టు బ్యాటర్ సికిందర్ రాజా సెంచరీ సాధించి ఆఖరి వరకూ పోరాటం చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చ లేకపోయాడు. తొమ్మిది బంతుల్లో 15 పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్ రాజా అవుట్ కావడంతో చివరికి భారత్కు విజయం లాంఛనమైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో 277 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఇక 13 పరుగులు తేడాతో ఏం జింబాబ్వే జట్టు పరాజయం పాలు కాగా ఇక టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. ఇక జింబాబ్వే బ్యాట్స్మెన్ సికిందర్ రాజా 115 పరుగులు అజేయంగా నిలిచాడు. విలియమ్స్ 45 పరుగులతో బాగా రాణించాడు. అయితే జింబాబ్వే జట్టు ఓడిపోయినప్పటికీ ఎంతో పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిగిన టీమిండియాపై సికిందర్ రాజా సెంచరీ చేసి ఏకంగా ప్రేక్షకుల మనసులు గెలిచాడు అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సికిందర్ రాజా వీరోచితమైన పోరాటానికి అటు ప్రేక్షకులు కూడా మంత్ర ముగ్గులు అయ్యారు అని చెప్పాలి. ఇక మరోవైపు భారత ఇన్నింగ్స్ సమయంలో శుబ్ మన్ గిల్ కూడా 97 బంతుల్లో 130 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.