గత కొంతకాలం నుంచి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ సాదా సీదా  ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక టీమిండియా అభిమానులందరినీ కూడా  వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. తద్వారా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కొన్నాళ్లు విశ్రాంతి తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆసియా కప్లో భాగంగా మంచి ప్రదర్శన చేశాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.


 మూడు సంవత్సరాల నుంచి సెంచరీకి దూరమైన విరాట్ కోహ్లీ రెండు రోజుల నిరీక్షణ తరువాత చివరికి ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ఈ క్రమంలో తన కెరియర్ లో 71వ సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ నేపథ్యంలో సహచర ఆటగాళ్లు మాజీ ఆటగాళ్లు కూడా అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయడంపై అతనికి సన్నిహితుడు అయిన మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ప్రశంసించాడు. గత కొంతకాలంగా పరుగులు   చేయడానికి ఇబ్బంది పడిన కోహ్లీ ఆసియా కప్ లోమాతో మాత్రం అద్భుతంగా రాణిస్తూ పరుగులు చేస్తున్నాడు అంటూ  చెప్పుకొచ్చాడు.



 అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మనసులో ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇక ఈ సెంచరీ ద్వారా అటు టీమిండియా సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తీసుకువచ్చాడు అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.  దీంతో రానున్న టి20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీనీ ఓపెనర్లుగా బరిలోకి దించేందుకు ఇప్పుడు సెలెక్టర్లు ఆలోచించే అవకాశం కూడా వుంది అంటూ రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్గా ఆడితే మిడిలార్డర్లో అదనపు ఫేసర్ తో పాటు అదనపు బ్యాటర్ ను కూడా కలిగి ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: