ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఊహించినదానికంటే ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరికి శ్రీలంక జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే శ్రీలంక జట్టు బ్యాటింగ్ రావాల్సి వచ్చింది.  అయితే 36 పరుగుల వద్దముగ్గురు కీలక బ్యాట్స్మెన్లు వికెట్ కోల్పోయి పేవిలియన్ చేరారు .


 దీంతో శ్రీలంక జట్టు కనీసం వంద పరుగులు అయినా చేస్తుందా లేదా అని అందులో అనుమానపడ్డారు. ఇలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన రాజకప్ప 45 బంతుల్లో 77 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఇక కష్టాల్లో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చాడు అని చెప్పాలి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా 171 పరుగులతో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు మొదట పటిష్టంగా కనిపించినా చివరికి కుప్పకూలిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఎవరు బ్యాటింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసియా కప్ ఫైనల్లో ఓటమి పై స్పందించిన పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ ఫీల్డింగ్ విభాగంలో మేము విఫలమయ్యాము అంటూ చెప్పుకొచ్చాడు.  8 ఓవర్ల మా ఆధిపత్యం కొనసాగింది.. అయితే రాజకప్ప వచ్చిన తర్వాత మొత్తం మారింది. అతను అద్భుతంగా రాణించాడు.  ఇక ఈ రోజు మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాను. ఫీలింగ్ లో పూర్తిగా విఫలమయ్యాము. అయితే ఇందులో మాకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. రిజ్వాన్, నవాజ్ బాగా ఆడారు.  ముందు చేసిన తప్పులు కంటే ఈ సారి కాస్త తక్కువ తప్పులు చేశాము. కానీ మరింత మెరుగ్గా రాణించి ఉంటే బాగుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: