
టీం ఇండియా ఎప్పటిలాగా కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడమే ఈ ఓటమికి కారణంగా తెలుస్తోంది. రోహిత్ మరియు పంత్ లు ఓపెనర్ లుగా రాగా, రోహిత్ రబడా బౌలింగ్ లో డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ వచ్చిన మంచి అవకాశాన్ని వాడుకోలేక ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పంత్ తో జత కలిసిన దినేష్ కార్తీక్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పంత్ మరియు కార్తీక్ లు పవర్ ప్లే ముగిసే లోపు 68 పరుగులు చేసి ఇండియా విజయంపై ఆశలు రేపారు. కానీ అనవసర షాట్ లకు ప్రయత్నించి ఇద్దరూ కాస్త వ్యవధిలోనే యూత్ అవడంతో ఆశలన్నీ ఆవిరైపోయాయి.
ఇక ఆల్ రౌండర్ లుగా పిలుచుకుంటున్న అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ మరియు అశ్విన్ లు రాణించలేదు. ఆఖర్లో దీపక్ చాహర్ మరియు ఉమేష్ యాదవ్ లు బ్యాట్ ను జులిపించారు కాబట్టి ఓటమి అంతరం తగ్గింది. అలా టీం ఇండియా మూడవ టీ 20 లో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఇది ఇండియాకు ప్రపంచ కప్ కు ముందు భారీ ఓటమి అని చెప్పాలి. సూర్య కుమార్ యాదవ్ రాణించకపోవడం వలన టీం ఇండియా కుప్పకూలిపోయి ఆత్మైని మూటగట్టుకుంది.