సాదరణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి స్లిప్ లో ఎక్కువ ఫీల్డర్లను పెట్టి ఇక బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. తద్వారా వికెట్ దక్కించుకోవాలని భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వ్యూహాలు ఎప్పుడు క్రికెట్లో చూస్తూనే ఉంటాం. సాధారణంగా స్లిప్ లో ఇద్దరు ఫీల్డర్లను పెడుతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని సార్లు ముగ్గురుని కూడా పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా జట్టులో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లను కూడా స్లిప్ లోనే ఫీల్డింగ్ పెడితేఎలా ఉంటుంది.


 ప్రొఫెషనల్ క్రికెట్ లో అలా ఎలా జరుగుతుంది గురు.. అలాంటివి అసాధ్యం అని అంటారు క్రికెట్ ప్రేక్షకులు.  కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఆశ్చర్యకర ఘటనే జరిగింది..  యూరోపియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా  క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఈ లీగ్ లో భాగంగా రోమేనియా వర్సెస్ నార్వే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే నార్వే ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అందరిని ఆశ్చర్యపరిచింది. నార్వే బౌలర్ తప్ప మిగతా 9 మంది ఫీల్డర్లు అందరూ కూడా స్లిప్ లో నిలబడి ఫీల్డింగ్ చేస్తూ  ఆశ్చర్యానికి గురి చేశారు.


 ఇలా బౌలర్ తన బౌలింగ్ తగ్గట్లుగా తొమ్మిది మంది ఫీల్డర్లను స్లిప్ లోనే ఫీలింగ్ కి పెట్టడం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రొమేనియా తో జరిగిన యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్షిప్ గ్రూప్ డి పోరూలో తొలిత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ తర్వాత మాత్రం రోమేనియా చేజింగ్  లో పూర్తిగా తడబడింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించడంలో డీలా పడిపోయింది. ఇక ఈ మ్యాచ్ టైంలో ఫీల్డర్లు అందరిని  స్లిప్ లో కెప్టెన్ మొహరించాడు. కీపర్ దగ్గర నుంచి గల్లీ వరకు 9 మంది ఫీల్డర్లు బ్లాక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూస్తున్న నెటిజన్లు ఇదెక్కడి పైత్యం రా బాబు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: