టి20 ఫార్మాట్ అంటే అటు బ్యాట్స్మెన్ ల విద్వాంసానికి మారుపేరు అని చెబుతూ ఉంటారు. అంతేకాదు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కి టి20 ఫార్మర్ కేరాఫ్ అడ్రస్ అని ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు అంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ ఫార్మాట్లో ఆడుతున్న ప్రతి ఆటగాడు కూడా తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్కు వచ్చిన ఆటగాడు సిక్సర్లు ఫోర్లు కొట్టాలని ప్రయత్నిస్తే.. బౌలింగ్ వేస్తున్న ఆటగాడు ప్రతిబంతిని డాట్ బాల్ గా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.


 మరోవైపు ఫీలింగ్ చేస్తున్న ఆటగాడు బౌండరీ వెళ్లే బంతులను సైతం అలవోకగా గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక  ఇలాంటివి ఉంటాయి కాబట్టే అటు టి20 ఫార్మాట్ కు అంతకంతకు క్రేజ్ పెరిగిపోతుంది అని చెప్పాలి  అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపద్యంలో అంతకుముందే అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లుగా ఉన్న ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరుగుతుంది.  ఈ క్రమంలోనే ఇటీవలే జరిగినా రెండవ టి20 మ్యాచ్ లో ఒక అద్భుత విన్యాసం ఆవిష్కృతమైంది అని చెప్పాలి.


 ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాదు ఏకంగా సూపర్ మ్యాన్ అతనికి పూనాడేమో అన్నట్లుగా బౌండరీ లైన్  దగ్గర అదిరిపోయే ఫీలింగ్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. బెన్ స్టోక్స్ బౌండరీ లైన్ దగ్గర ఏకంగా సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగురుతూ చేసిన విన్యాసం ప్రేక్షకులు అందరి మనసు దోచుకుంది. ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 12వ ఓవర్లో మిచెల్ మార్ష్ భారీ షాట్ ఆడాడు. అయితే ఆ షాట్ తప్పకుండా బౌండరీ లైన్ అవతల పడుతుందని అందరూ అనుకున్నారు. చివరికి బ్యాట్స్మెన్లు కాన్ఫిడెంట్గా పరుగు తీయడం కూడా మానుకున్నారు. ఈలోపే రౌండర్ లైన్ వద్ద ఉన్న బెల్ స్టాక్స్ పక్షి లాగా  గాల్లోకి ఎగిరి లైన్ బయటపడాల్సిన బంతిని లోపలికి నెట్టేస్తాడు. ఇది చూసిన అందరూ కూడా నోరేళ్లపెట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: