
ఇండియా జట్టు అన్ని విభాగాలలోనూ బలంగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా టోర్నీలో ఇండియా విజయపధంలో దూసుకురావడానికి ప్రధాన కారణం ఆ జట్టుకు వెన్నెముకగా నిలిచిన స్మృతి మందన్న, షెపాలీ వర్మ, జెమీమా రోడ్రిగస్ మరియు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు.. ఈ నలుగురిలో ఒకరు ఫెయిల్ అయినా మిగతా ఆటగాళ్లు రాణించి జట్టుకు విజయాలు అందిస్తూ వచ్చారు. అయితే సెమీఫైనల్ లో మాత్రం థాయిలాండ్ మీద కాస్త తడబడ్డారు. అందులో స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడ్డారు.
కాగా ఇప్పుడు శ్రీలంక జట్టుకు ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్ అని చెప్పాలి. స్పిన్ బౌలింగ్ తోనే పాకిస్తాన్ ను సెమీఫైనల్ లో అడ్డుకుంది. ఇక శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే అంత ప్రభావవంతంగా లేదు. ముఖ్యంగా శ్రీలంక కీలక ప్లేయర్ ఆటపట్టు ఫామ్ లో లేకపోవడం పెద్ద లోటు అని చెప్పాలి. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక గెలవడం దాదాపు అసాధ్యమే. మరి చూద్దాం ఫైనల్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే ఇంకాస్త సేపు ఆగాల్సిందే.