
అయితే సాదాసీదా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగినప్పుడే ఇలా రివ్యూ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇక వరల్డ్ కప్ లో భాగంగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే చిరకాల ప్రత్యర్ధులు అయినా పాకిస్తాన్ భారత్ మధ్య ఉత్కంఠ భరితమైన సమరం జరగబోతుంది. ఇక ఇలాంటి మ్యాచ్ పై రివ్యూలు ఇవ్వకుండా ఉంటారా.. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇరుజట్లకు పలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును కూడా ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ లో తుడిజట్టు ఎలా ఉంటుంది అనే విషయంపై ఇటీవల భారత డేర్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ తన ప్లేయింగ్ ఎలెవన్ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే అందరూ వరల్డ్ కప్ టీమిండియా తుది జట్టులో తప్పక ఉంటాడు అనుకుంటున్న దినేష్ కార్తీక్ కి మాత్రం గౌతం గంభీర్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, హర్షదీప్ సింగ్ లేదా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, షమీలు ఇక తన అంచనా ప్రకారం తుదిజట్టులో చోటు సంపాదించుకుంటారు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.