సాధారణంగా క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు గెలుస్తుంది అనుకున్న జట్టు చివర్లో పేలవ ప్రదర్శన చేసి ఓడిపోవడం.. ఇక ఓడిపోతుంది అనుకున్న జట్టు చివరిలో మెరుపులు మెరిపించి  విజయం సాధించడం క్రికెట్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి అద్భుతాలు చాలానే జరుగుతూ ఉన్నాయి.


 పసికూన జట్లు సైతం ఏకంగా ఛాంపియన్ జట్లను ఓడించి క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కొంతమంది అద్భుతమైన రికార్డులు సాధిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉండటం గమనార్ధం. ఇకపోతే ఇటీవలే ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక చెత్త రికార్డు నమోదయింది అని చెప్పాలి. సాధారణంగా ఇప్పటివరకు ఒక బంతికి సిక్సర్ లేదా ఫోర్ ద్వారా ఎక్కువ పరుగులు రావడం మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఒక బంతికి 14 పరుగులు వచ్చాయి.


 అదేంటి ఒక బంతికి 14 పరుగులు రావడం ఏంటి? అదేలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యంలో మునిగిపోయారు కదా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొమ్మిదో ఓవర్లో ఓకే బంతికి రాహుల్ 14 పరుగులు రాబట్టాడు. ఇస్లాం వేసిన నాలుగవ బంతికి రాహుల్ సిక్సర్ కొట్టాడు. అయితే అది నోబాల్ కావడంతో అంపైర్లు  ఫ్రీ హిట్ ప్రకటించాడు. దీంతో సిక్సర్ ప్లస్ నోబాల్ ఇక కలిపి ఏడు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత బంతి వైడ్ బాల్ గా వెళ్ళింది. దీంతో మరో రన్ వచ్చింది. ఇక ఫ్రీ హిట్ కంటిన్యూ కావడంతో ఫ్రీ హిట్ నూ ఉపయోగించుకున్న రాహుల్ మరోసారి సిక్సర్ బాదాడు. దీంతో మరో ఆరు పరుగులు వచ్చాయి. ఇలా మొత్తంగా ఒకే బాల్ కి 14 పరుగులు రాబట్టాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: