టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ధోనీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. అయితే అందరితో పోల్చి చూస్తే ధోని సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటాడు. కానీ ధోని గురించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇక ఏ చిన్న విషయం ఇంటర్నెట్ లోకి వచ్చిన అది వైరల్ గా మారిపోవడం జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అదేంటంటే ధోని రాజకీయాల్లోకి రాబోతున్నాడని.. అయితే ధోని రాజకీయాల్లోకి రాబోతున్నాడని చర్చ ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. ధోని సహచర ఆటగాడు అయినా గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత ఏకంగా బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. ఇక మరికొన్ని రోజుల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సైతం బిజెపి అధిష్టానం ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మ్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే మహేంద్ర సింగ్ ధోని హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో దిగిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.


 దీంతో ఎన్నో రోజుల నుంచి అటు ధోని రాజకీయాల్లో చేరబోతున్నాడు అనే చర్చ జరగగా.. ఇక ఇప్పుడు ధోని మరికొన్ని రోజుల్లో బిజెపిలో చేరబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. అందుకే ఇక అటు అమిత్ షా మోదిలను ధోని కలిశాడు అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ ఇండియా సిమెంట్ కంపెనీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించగా.. ధోని హాజరయ్యాడు. ఇక అక్కడికి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రావడంతో వారితో కలిసి ఫోటోలు దిగాడు ధోని. ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారిపోవడంతో ఈ చర్చ జరిగింది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రానున్న రోజులో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: